మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)ప్రారంభంలో కొత్త ప్రాజెక్టుల విషయంలో పై అధికారులతో కలిసి సృజనాత్మకతతో వృత్తి పరమైన శ్రమ, బాధ్యతలు అధికం. తగిన గౌరవం లభ్యమైన నిద్రలేమి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీలలో అనుకూలం. కమ్యూనికేషన్ బాగుంటుంది, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. నెట్వర్క్ ఏర్పరచుకుంటారు. విదేశీ విషయాలు, ఆశించిన అంశాలు అనుకూలం. మిత్రులతో దీర్ఘంగా ప్రణాళికలను చర్చిస్తారు. తక్కువ శ్రమతో మంచి ఫలితాలు పొందుతారు. పెద్దలు గురువుల సహకారం, మార్గదర్శకత్వం అనుకూలిస్తుంది. మధ్యలో శ్రమ, ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. కుటుంబంతో కలిసి షాపింగు. వారాంతం నూతన ఉత్సాహం, పనులలో విజయం. అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
ప్రారంభంలో గురువులు, పెద్దల ఆశీస్సులు తో సంతృప్తి.పుణ్య బలం అనుకూలం. ఉన్నత విద్యా విషయంలో కుటుంబ పెద్దల, పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో నిర్ణయాలు. గృహసౌఖ్యం. విద్యార్థులకు అనుకూల కాలం. ఆరోగ్యం, హాబీల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. రోగ నిరోధక శక్తి, న్యాయపరమైన అంశాలు అనుకూలం, ప్రత్యర్థులపై విజయాలు. ఆలస్యమైన పనులు ముందు కదులుతాయి. దూర ప్రదేశాలలో నూతన వృత్తులకు అవకాశాలు. ఆర్థిక విషయాలు కుటుంబ సభ్యుల సహకారం. తోబుట్టువులతో నిర్ణయాలు. దీర్ఘకాలిక పెట్టుబడులు భూ సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. మాట విలువ పెరుగుతుంది. సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
ప్రారంభంలో ముఖ్యమైన పనులలో విషయాలు ఆలస్యాలు, ఆటంకాలు చికాకును కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారాన్ని కోరుకున్నట్లయితే ముఖ్యంగా అధికార స్థాయిలో ఉన్న స్త్రీలతో వినయముగా వ్యవహరించి, వృత్తిలో మీరు పూర్తి చేయవలసిన పనులను చక్కని సృజనాత్మకతతో సమయానికి నిర్వర్తించినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. వాయిదా వేయడం మంచిది కాదు. విద్యార్థులు గణితము మొదలైనవాటిలో నైపుణ్యాలు పెంచుకోవాలి. బద్ధకాన్ని అధిగమించాలి ఆర్థిక విషయాలలో, రుణముల సంబంధించిన అంశాలలో ముఖ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశించిన ఫలితాలు. తోబుట్టువుల సహకారం బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)ప్రారంభంలో సంఘంలో గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతాయి. దూర ప్రాంతాలలో ఉన్న వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు, భాగస్వామితో అనుకూలం. తండ్రి గారి ఆరోగ్యము పై శ్రద్ధ. వారం మధ్యలో ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు ఆటంకాలు, ఆరోగ్య విషయంలో చికాకులు. మానసిక చింత. అనవసర ఖర్చులు. బంధువులతో, వృత్తిలో, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సహకరించే సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల పనులలో ప్రణాళికలలో ఆకస్మిక ఒత్తిడి. ఉన్నత విద్యలో తీసుకునే నిర్ణయాలలో మంచి గురువు మార్గదర్శకత్వం అనుకూలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన దూర ప్రయాణాలకు అవకాశం. గుర్తింపు తెచ్చే ఒక వార్త ఆనందాన్నిస్తుంది. వృత్తిపరమైన కొత్త అవకాశాలు వాయిదా. విష్ణు సహస్రనామాలు మేలు.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
ప్రారంభంలో ప్రత్యర్థుల మీద విజయం కొరకు, వృత్తిలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి అధిక శ్రమ చేస్తారు. న్యాయపరమైన అంశాలు, ఆరోగ్య విషయాల కొరకు ఖర్చులు అధికం. సంఘంలో గుర్తింపు గౌరవం, నూతన పరిచయాలు, వ్యాపార విస్తరణ ప్రయాణాలు. భాగస్వామ్య వ్యవహారాలు కొరకు ఆకస్మిక ధనవ్యయం. లాభపరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ వ్యక్తీకరణ సందర్భంలో ముఖ్యంగా స్నేహ సంబంధాల్లో, కుటుంబ బంధాలలో చర్చలు ఘర్షణలకు దారి తీయకుండా తగు జాగ్రత్తలతో ఆచితూచి ముందుకు వెళ్లాలి. మధ్యలో పనులు వాయిదా పడే అవకాశం, పనులు ఆలస్యాల వల్ల అనుకోని విమర్శలు ప్రశాంతతను తగ్గిస్తాయి. ధ్యానం మంచిది. దూర ప్రదేశాలలో వ్యాపార విస్తరణ, సంతానం విద్య విషయంలో నూతన ఆలోచనలు. నిర్ణయాలలో ఉద్వేగాలని అధిగమించాలి. నవగ్రహ శ్లోకములు, ఆలయ దర్శనము మేలు.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
వారం ప్రారంభంలో ఆత్మీయ వ్యక్తులతో విందు వినోదాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, ఆర్థిక అంశాలు ఆనందకరం. ముఖ్య విషయాలలో భాగస్వామితో తీసుకునే నిర్ణయాలలో ఆలస్యాలు, అభిప్రాయ బేధాలు అధిగమించాలి. మధ్యలో అనుకున్న పనులు సాధిస్తారు, శ్రమ అధికం, ముఖ్యంగా భూమి, న్యాయపరమైన అంశాలు, ఎదురుచూస్తున్న విషయాలలో అనుకూలతలు. బంధువులతో చర్చిస్తారు. వృత్తిలో గౌరవం నూతన బాధ్యతలు. విద్యార్థులకు అనుకూలం పోటీలలో శ్రమకు తగిన గుర్తింపు అవకాశం. సాంఘిక సంబంధాలు, ఉన్నత స్థాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో మైత్రి బంధాలను పెంపొందించు కుంటారు. వారాంతం ఆరోగ్య విషయంలో శ్రద్ధ, స్థిరాస్తుల విషయంలో ఆకస్మిక లబ్ధి. అమ్మవారి ఆరాధన మేలు.
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ప్రారంభంలో తల్లి ఆరోగ్యం, స్థిరాస్తులు, గృహ వాతావరణం మొదలైన విషయాలు ఆలోచనలో ఉంటాయి. తత్సంబంధ అనుకూలమైన నిర్ణయాలకి ప్రయత్నం. వృత్తిపరంగా సృజనాత్మక నిర్ణయాలతో ముందుకు వెళతారు అయినప్పటికీ కమ్యూనికేషన్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ప్రశాంతత తక్కువ. అనవసర ఆందోళనను, ఉద్వేగాలను అధిగమించాలి. వృత్తిపరమైన శ్రమ ఉన్నప్పటికీ ఆర్థికంగా అనుకూలం. వ్యాధి నిరోధక శక్తి , న్యాయపరమైన అంశాలలో ఆలస్యమైన ఆశించిన ఫలితాలు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులని అధిగమిస్తారు. వారాంతంలో వృత్తిలో గుర్తింపు గౌరవం స్నేహ సంబంధాలు అభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి విషయంలో తగిన శ్రద్ధ. వ్యాపార విషయాలలో ఆచితూచి ముందుకెళ్లాలి. ఇష్టదేవతారాధన మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రారంభంలో సామర్థ్యంతో ఆగుతూవచ్చిన పనులు పూర్తి. నిర్ణయాలు బాగుంటాయి. పెద్దలు గురువులు సహకరిస్తారు. గృహ సౌఖ్యం, వాహనాలు, స్థిరాస్తులు, భూ సంబంధ అంశాలు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు విద్యా విషయాలలో శ్రద్ధ పెంచుకోవాలి, జ్ఞాపకశక్తి, వ్రాత నైపుణ్యాలు విషయంలో, మరియు వాహనాలు నడిపేవారు వాహనాలు విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. తల్లి ఆరోగ్యము పై దృష్టి సారిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఊహించని అభిప్రాయ బేధాలకు వృత్తిలోనూ, మైత్రి బంధాలలోనూ అవకాశం. ఆధ్యాత్మిక ఆలోచనలు క్షేత్ర సందర్శన భాగస్వామికి గుర్తింపు గౌరవం అనుకూల ఫలితాలు ప్రయాణాలకు అవకాశాలు. జీవిత భాగస్వామితో షాపింగ్ లు, సంతానానికి అభివృద్ధి ఖర్చులు. శ్రమతో అనుకున్న పనులలోవిజయం. హనుమాన్ దేవాలయ సందర్శనమేలు.
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో ఆర్థిక విషయాలలో, వాగ్దానాలలో అనుకూలతలు. కుటుంబంలో మాటవిలువ పెరుగుతుంది, ఆకస్మిక ఖర్చులు, బంధువర్గం రాక. సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ధైర్యం పరాక్రమం పెరుగుతాయి, మిత్రుల సహకారం బాగుంటుంది. సంతానము, తోబుట్టువుల కొరకు ఖర్చులు చేస్తారు. క్రీడాకారులకు అనుకూలం. సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. తండ్రి, పెద్దలతో వీలైనంత వినయంగా వ్యవహరించాలి. వృత్తిపరమైన విషయాలలో, గృహ సంబంధ అంశాలలో ఆలస్యాలు ఆటంకాలు మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. నూతన వాహన కొనుగోలు, షాపింగులు కొరకు ఖర్చులు అధికం. పూర్వపు రుణసంబంధ విషయాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. వారాంతంలో సంతానవర్గం అనుకూలం, ఆత్మీయ వ్యక్తులతో పూర్వపు అభిప్రాయ భేదములను అధిగమిస్తారు. జీవిత భాగస్వామిఆరోగ్య విషయంలోశ్రద్ధ. సత్యనారాయణ స్వామి ఆరాధన మేలు.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
ప్రారంభంలో జీవిత భాగస్వామి సహకారం అనుకూలం. నూతన ఉత్సాహంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి తో కలిసి దూర ప్రదేశాలలో ఉన్న సంతానంతో షాపింగులు వంటివి, ఆత్మీయ వ్యక్తుల కలయిక. విందు వినోదాల్లో పాల్గొనుట. ఖరీదైన వస్తువుల కొనుగోలు. ఆదాయం అనుకూలం, ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలి. భాగస్వామి బంధువర్గముతో అనుకూల చర్చలు. రాకపోకలు. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణలో తగిన జాగ్రత్తలు అవసరం. దంత నేత్ర సంబంధ ఆరోగ్య విషయాలలో శ్రద్ధ. సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు, అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ఆగుతూ వచ్చిన పనిని పూర్తి చేస్తారు.రాజకీయంగా పలుకుబడి, ఉన్నతస్థాయి అధికారుల, కళా రంగంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. తల్లి ఆరోగ్యం స్థిరాస్తులు గృహ విషయాలలో అనుకూలత. నూతన వాహన కొనుగోలు యత్నం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
ప్రారంభంలో శత్రు రోగ రుణముల విషయంలో ఆకస్మిక ఖర్చులు. నూతన బాధ్యతలతో శ్రమ అధికంగా ఉంటుంది నిద్రలేమి. మానసిక ప్రశాంతత, విశ్రాంతి అవసరం. మధ్యలో కొత్త ఆలోచనలు నిర్ణయాలు, నాయకత్వ లక్షణాలు. అధిక ఆత్మవిశ్వాసం, ఉద్వేగాలను అధిగమించాలి. కోపాన్ని, కఠిన వాక్కును నియంత్రించుకోవాలి. ఆశించిన వ్యక్తుల యొక్క సహకారం వృత్తిపరంగా ఆలస్యంగా నైనా అందుకనే అవకాశాలు. సహనం అవసరం. ఆర్థిక విషయాలలో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. తల్లితండ్రుల సహకారం ఆర్థికంగా, వ్యక్తిగత నిర్ణయాలలో తోడ్పడుతుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఇబ్బంది కలిగించిన తగిన శ్రమతో అధిగమించ గలుగుతారు. వారాంతంలో సామర్థ్యంతో లక్ష్యంతో పనులు నిర్వర్తిస్తారు, తోబుట్టువుల సహకారం బాగుంటుంది. వృత్తిలో కొలీగ్స్తో సమన్వయం అవసరం. విష్ణుమూర్తి దేవాలయ సందర్శనమేలు.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
ప్రారంభంలో మానసిక ప్రశాంతత, సంతాన వర్గం సహకారం, ఆలోచనలు లాబిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు కవులకు రచయితలకు అనుకూలమైన సమయం. గుర్తింపు గౌరవం. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు. కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు, భూమి మొదలైన వాటి మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు, అనవసర వ్యయాలకు, మోసాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలకు అవకాశం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. వ్యాపార వ్యవహారాల్లో క్రయవిక్రయాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వారాంతంలో ఆలస్య మైనప్పటికీ ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, రోగ నిరోధక శక్తి, వ్యక్తుల సహకారం అనుకూలం. రావలసిన గుర్తింపు లభ్యం. కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలలో, వాగ్దానాలలో ఘర్షణలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్లినట్లయితే అనుకూలం. పూర్వము ఇచ్చిన రుణములు వెనుకకు వచ్చుటకు అవకాశం తక్కువ అని గ్రహిస్తారు. శంకరుని ఆలయ దర్శన మేలు.
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa