ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 15, 2026, 06:04 PM

నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం సంప్రదాయ బద్దంగా జరిగిందని.. దేవాన్ష్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని..అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలం దేవాన్ష్‌కు అండగా ఉండాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. మనవడి వేడుకలో పాల్గొనడం తనకు గొప్ప జ్ఞాపకంగా ఎప్పటికి నిలిచి ఉంటుందన్నారు. మరోవైపు ప్రజాభవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య, కోడలు సాక్షిలను ఆశీర్వదించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa