సూర్య నంది క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహసంగ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రావణ్ కుమార్, కృష్ణార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశం ఘనమైన చరిత్రను సంస్కృతిని ముందు తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పైన ఉందని వారు తెలిపారు.