కోసిగి పరిసరాల్లో ఉన్న తిమ్మప్ప కొండపై ఆదివారం తెల్లవారుజామున 2 చిరుతలు కనిపించడంతో బెంబేలెత్తిపోతున్నారు. కొండ పరిసరాలకు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. ఫారెస్ట్ అధికారులు వీటిని గుర్తించేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు వీటిని బంధించడంలో విఫలమయ్యారని కోసిగి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతల నుండి రక్షణ కల్పించాలని గొర్రెల కాపరులు కోరారు.