కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆదివారం అయ్యప్ప స్వాముల భక్తుల రద్దీ పెరిగింది. కాణిపాకం ఆలయం శబరిమలైను తలపిస్తుంది. ఆలయంలో క్యూలైన్ నిండిపోయి వెలుపలకు భక్తులు భారులు తీరారు. అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్లోని భక్తులు, శబరిమలై వెళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా కాణిపాకం గణపతిని దర్శించుకోవడానికి బారులు తీరారు.