పెన్షనర్ల ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఈఓ రాముడు డిమాండ్ చేశారు. ఆదివారం గుంతకల్లు పట్టణంలోని పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమస్యలపై విశ్రాంత ఉద్యోగులు చర్చించారు. డిఎ బకాయిలు వంటి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి వెంకటా చలపతి, కోశాధికారి దాదా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.