మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆర్కే అసెంబ్లీలో తన రాజీనామా లేఖను అందజేశారు. ఆర్కే గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖను అందజేశారు.
వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.