ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి సూచించారు. "వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుంది. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. డివైడర్ తొలిగించే వరకు జనసేన పోరాడుతుంది అని నాదెండ్ల మనోహర్ తెలిపారు