బండారు సతీమణి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బండారు సత్యనారాయణను అక్రమంగా అరెస్టు చేశారన్న పిటిషనర్ వాదనలు వినిపించారు. అటు అరెస్టు సమయంలో తీసిన ఫొటోలను పోలీసులు కోర్టుకు అందించారు.
అయితే ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజ్‌ను బండారు తరఫు న్యాయవాది గతంలోనే కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. 4 వారాల తర్వాత తుది విచారణ చేపడతామని కేసు వాయిదా వేసింది.