సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు జార్ఖండ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. సివిల్ దుస్తుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బరాకర్ నదితీరం వద్ద ఆరుగురు అనుమానితులు కనిపించారు.
వాళ్లను సైబర్ నేరగాళ్లుగా ధృవీకరించుకుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వారు నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించారు. కానీ పోలీసులు అతవలి ఒడ్డుకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు.