మాట తప్పాడు మడమ తిప్పాడు హామీలు ఎగ్గొట్టాడు అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. సోమవారం లోకేష్ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్లు దాటడంతో పెనుకొండ పట్టణంలోని ఎన్ టి ఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి బాణసంచా కాల్చారు. ఈ సందర్బంగా సవితమ్మ మాట్లాడుతూ జగన్ రెడ్డి ఉపాధ్యాయులను ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకొచ్చావని అన్నారు.