మార్కాపురం మండలంలోని కొండేపల్లి గ్రామానికి చెందిన మూల ఆదినారాయణ అమ్మ వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పుల బాధ తాళలేకలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి రూ.7 లక్షల చెక్కును ఆమె భర్త మూల కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపల్లి గ్రామ యంపిటిసి కుందూరు వెంకటరెడ్డి, మార్కాపురం సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, వ్యవసాయ అధికారి, తదితరులు పాల్గొన్నారు.