గుడ్లూరు మండల పరిధిలోని మాగాణి భూములకు నీరు లేక అధనుపోతున్న ఇప్పటి వరకు రైతాంగం వ్యవసాయ పనులు మొదలెట్టలేదు అంటే గమనార్హం. అక్కడక్కడ ఒకరో ఇద్దరో రైతులు తమ పొలాల్లో వ్యవసాయ బోరు మోటర్లు ఉండటం వల్ల వరినాట్లు వేశారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో గుడ్లూరు మండల పరిధిలో కానీ, ప్రక్క మండలం లింగసముద్రంలో కానీ రైతులకు వ్యవసాయానికి సరిపడేంత వర్షపాతం నమోదు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.