ప్రకాశం జిల్లా కొమరోలు మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం ఆడదాం ఆంధ్ర కిట్లను ఎంపీపీ కామూరి అమూల్య ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అతి త్వరలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసయ్యతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.