అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ లో సోమవారం కళ్యాణదుర్గం నియోజకవర్గ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు చిత్తప్ప, జిల్లా అధ్యక్షులు వేలూరి రంగయ్య, రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగల క్రిష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు.