హిందూపురం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా అండగా ఉంటామని హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకులు వేణురెడ్డి అన్నారు. సోమవారం మండలం లోని బీరేపల్లి పంచాయతీలో మమేకం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయ కులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు వైస్చర్మన్ మహేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.