జిల్లా వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ చార్జీలు ప్రభుత్వ విడుదల చెయ్యాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి గుంతకల్లు మండలంలోని పాత కొత్తచెరువు గ్రామంలోని బిసి బాలుర వసతి గృహంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి, నిద్ర చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకట్ నాయక్, నాయకులు శ్యాంసుందర్ పాల్గొన్నారు.