అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు ఉన్న కాళీ ప్రదేశంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వృద్ధ మహిళ మృతదేహం ఉందనే స్థానికుల సమాచారంతో అద్దంకి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.