మున్సిపాలిటీలో పనిచేస్తున్న అపుట్ సోర్సింగ్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐటియూసి గౌరవ అధ్యక్షుడు వీరభద్ర స్వామి డిమాండ్ చేశారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో కార్మికుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈనెల 27 నుంచి వారు సమ్మెలోకి వెళతారని యూనియన్ నాయకులు అన్నారు.