బీహార్లోని జమూయి జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే ప్రసవంలో ముగ్గురు పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
మగబిడ్డతో గర్భం దాల్చి ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం. నా కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో అర్థం కావడం లేదు’ అని మహిళ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నట్లు ఆమె తెలిపింది.