ప్రజలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు చెబితే చాలు మంచి స్పందన వస్తుందని బిజెపి ఒంగోలు కన్వీనర్ వైసీ యోగయ్య యాదవ్ తెలిపారు. ఒంగోలు మండలం బిజెపి ఆధ్వర్యంలో బొద్దులూరి వారి పాలెంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వికసిత్ భారత్ తో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు చెప్పారు.