జిల్లాలో కరువు తుఫాన్ తో వరద బారిన పడి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ ధర్నాను విజయవంతం చేయాలన్నారు.