వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు నాలుగున్నర ఏళ్లుగా దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తున్నారని జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి మండిపడ్డారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ గారిని, జనసేన నాయకులను విడుదల చేయకపోతే నేరుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తారని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడం, హౌస్ అరెస్టులు చేయడం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. జనసేన తరఫున అక్రమాలు, దౌర్జన్యాలపై పోరాడుతూనే ఉంటామన్నారు.
మరో మూడు నెలలు ఓపిక పట్టాలని, జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని , వైసీపీ పాలనలో నేరాలు ఎక్కువైపోయాయి అన్నారు . నాదెండ్ల మనోహర్ గారి ను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని, ప్రజా సమస్యలపై పోరాడడానికి వెళ్తే అరెస్టు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఎక్కడికైనా వెళ్లి నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని అన్నారు. ఈ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెడుతున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చింది కేవలం కక్ష సాధింపు కోసమేనని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసారు అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని జనసేన - టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పక్క రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ ను చూసి హేళన చేస్తున్నారని విమర్శించారు.