కందుకూరు ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్జూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాయకులు, కార్మికులు ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ రావు హాజరై మాట్లాడుతూ. యాజమాన్యం, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.