ఖాజీపేట మండలం దుంపలగట్టులో సోమవారం రెడ్యo విలేకరులతో మాట్లాడుతూ. పోలీసులు పోలీసు అధికారులు అంటే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకు పుట్టేదని, కానీ నేడు పోలీసు అధికారులకే దిక్కులేకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైన పోలీసులకే దిక్కులేకపోతే, గుండాలు, వీధి రౌడీలదే రాజ్యం అవుతుందని అందులో సామాన్య ప్రజలు దిక్కులేనివారుగా నిలుస్తారని ఆవేదన వ్యక్తపరిచారు.