రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ప్రొద్దుటూరు స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే బాధ్యతలు చేపట్టాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసరెడ్డి, రమేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి పాల్గొ న్నారు.