పులివెందుల పట్టణంలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం ముందు మంగళవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గతంలో చెప్పిన హామీలు అమలు చేయడం లేదని ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వీరికి మద్దతు పలికి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.