ప్రైవేట్ సంస్థల నుంచి అవార్డులు స్వీకరించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని స్వీకరించే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.