తాడిపత్రి మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే నిత్యం అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే ముఖ్యమన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం విమర్శించారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి పురపాలికలో మురుగు, తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.