కళ్యాణదుర్గం ప్రధాన మండల కేంద్రం లోని శివారు ప్రాంతంలోని పొలాల్లో మంగళవారం కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ పంకజ్ యాదవ్ నేతృత్వంలోని పదిమందితో కూడిన బృందం జిల్లాలోని పలు ప్రాంతాలలో మూడు బృందాలుగా విడిపోయి నేరుగా రైతులతో మాట్లాడి ఆముదము, కంది, ఉలవ వేరుశనగ పంటల సాగు, దిగుబడి తదితర అంశాలపై ముఖాముఖిగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.