గుంతకల్లు పట్టణం ఆలూరు రోడ్డులోని సిఐటియు కాలనీలో తాగునీరు కుళాయిలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు మారుతీ ప్రసాద్, చంద్ర మాట్లాడుతూ కాలనీ ఏర్పడి ముప్పై ఏళ్లు గడిచినా ఇప్పటికీ కాలనీలో తాగునీరు, మురుగు కాల్వలు వంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు.