ఓటరు జాబితా సవరణ పనులు చివరి దశలో ఉన్నాయని, 2024 జనవరి 5వ తేదీ తుది జాబితా విడుదల చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందన్నారు.
అంతకు ముందే ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓటరు గుర్తింపుకార్డు కోల్పోయిన వారు ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.