ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును యూఐడీఏఐ పెంచింది.
వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకోని వారు వెంటనే చేయించుకోవాలని సూచించింది.