ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ జ‌గ‌న్‌ను ఇమిటేట్ చేస్తున్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 05:46 PM

టీడీపీ, జనసేన పార్టీ నేతలువైయస్ఆర్‌సీపీని విమర్శించే ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు ఎక్కడ పోటీ చేయాలో, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో వాళ్ళకు ఇప్పటికీ స్పష్టత లేదని అన్నారు.175 స్దానాలలో ఎలా గెలవాలో విజయం సాధించాలంటే ఏమి చేయాలనే క్లారిటీ, స్ర్టాటజీ  వైయస్ జగన్ గారికి,మా పార్టీకి ఉందన్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ను లోకేష్ ఇమిటేట్ చేస్తుంటాడంటూ లోకేష్ 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఎక్కడ చేశాడో ఎవరికీ తెలియదని అన్నారు. వైయస్ జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు దోహద పడిందని అన్నారు. అందుకు అది చరిత్రలో నిలిచిపోయిందన్నారు. సమన్వయకర్తలను అంటే నాయకుడిని మార్చితే కింద ఉన్న క్యాడర్ ఇబ్బంది పడటం సహజం అని చెప్పారు. మార్పులు చేసిన చోట వారందర్ని పిలిచి మాట్లాడతామని వివరించారు.చిన్న చిన్న చికాకులను సరిదిద్దటం పెద్ద విషయమేమి కాదని స్పష్టం చేశారు. వైయ‌స్ జగన్ గారు 2019 అధికారంలోకి రావడానికి ముందు ఏది చేయగలమో అది చెప్పి, మేనిఫెస్టోను పవిత్రగ్రంధంగా చూసుకుని ప్రజలలో ఆశీస్సులు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని తెలియచేశారు. ఆ తర్వాతనే మేము ప్రజల ఆశీస్సులు కోరతామని ప్రకటించామన్నారు. పరిపాలన అంతా చూస్తే 99.5 హామీలను నెరవేర్చడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ,సమన్వయకర్తలతోను,శాసనసభ్యులతో  గడపగడపకు రెండేళ్లముందే ప్రారంభింపచేశారు. ప్రజలతో మమేకం చేయడమే కాకుండా ప్రజలకు ఏమి చేశామో చెప్పడం వారికి అన్నీ అందాయా లేదా అనేది కూడా తరచి తరచి చూసేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. అప్పటినుంచే మొదలైంది. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలైందో అప్పుడే వైయస్ జగన్ గారు ఒక్కటి స్పష్టంగా చెప్పారు. ప్రజలలోకి మళ్లీ వెళ్ళేటప్పటికి ప్రజలలో శాటిస్ ఫ్యాక్షన్ స్దాయి, ఎంఎల్ఏ గా మీ పట్ల, ముఖ్యమంత్రిగా నా పట్ల ఎలా ఉందో తెలుస్తూ వస్తే ఇందులో వాటిని నెెక్ట్స్ అభ్యర్దిని నిర్ణయించేటప్పుడు  ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. ఇందులో అందరూ నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను. మాతోపాటు అసెంబ్లీకి రాలేని 23 మందితో కలసి 175 మంది కావాలని అనుకుంటున్నాను అని కూడా తెలియచేశారు. ఎవ్వరూ కూడా వేరే విధంగా ఆలోచించవద్దు. అల్టిమేట్ గా ప్రజలకోసం మార్పులు కూడా చేస్తామని..... చేయాల్సి ఉంటుందని కూడా స్పష్టంగా శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు తెలియచేశారు. అందులో భాగంగా ఇది నిరంతరంగా జరుగుతుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అచరణలో మార్పులు,చేర్పులు జరుగుతూ వస్తాయన్నారు. ఇవి జరిగేటప్పుడు మరింత మెరుగైన మెజారిటీతో గెలుపు, అలాగే ప్రజలకు యాక్సెప్టబులిటి ఉందా లేదా..... దానిపై అభ్యర్దులలో మార్పులు చేర్పులు....లేదా వారే కంటిన్యూ కావడం నిర్ణయిస్తారు. వైయ‌స్ జగన్ గారు బలంగా విశ్వసించే రాజకీయసాధికారిత దిశగా బలహీనవర్గాలకు,మహిళలకు ప్రాతినిద్యం పెరిగే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ఆలోచన చేయడం జరుగుతూ వస్తోంది అని అన్నారు. దీనిని చూసి అప్పుడే టిడిపి,జనసేన లు  బెంబేలు ఎత్తుతూ  ప్రజలలో అయోమయం సృష్టించేందుకు 80 మందిని మారుస్తున్నారు...90 మందిని మారుస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. ముందు టిడిపి జనసేనలు వాళ్ళ ఇళ్లు వాళ్లు చక్కబెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com