తూర్పు సిక్కింలో మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 800 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. భారత ఆర్మీ సైనికులు బుధవారం పర్యాటకులను రక్షించారు.
భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సాయంత్రం వరకు కొనసాగిందని, చిక్కుకుపోయిన పర్యాటకులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వారు తెలిపారు. పర్యాటకులందరికీ ఆశ్రయం, వెచ్చని బట్టలు, వైద్య సహాయం, ఆహారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు.