ఆధార్ కార్డు అప్‌డేషన్ కోసం యూఐడీఏఐ మరోసారి గడువు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా 2024 మార్చి 14 వరకూ గడువు ఇచ్చింది. అయితే ఆధార్ సేవల కోసం అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.
సంబంధిత ఆపరేటర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్ట్రార్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తామని స్పష్టంచేసింది. దీనిపై యూఐడీఏఐకు మెయిల్ లేదా 1947 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.