ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఇన్‌పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ-క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa