చెన్నై ప్రజలకు సీఎం స్టాలిన్ శుభవార్త తెలిపారు. సీఎం వరద సహాయ నిధికి రూ.6000 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో చెన్నై జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అలాగే చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగ్జామ్ తుపాను వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు త్వరలోనే రూ.6000 నగదు అందజేస్తామని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రకటించారు.