వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా పాలకొండ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ ఆశయాల సాధన లక్ష్యంగా సమానత్వంతో పాటుగా ఆర్థికంగా, సామాజికంగా సాధికారతను అందించేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎంతో పట్టుదలతో ఉన్నారని, అందుకే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చి గిరిజనుల బిడ్డగా నిలిచారని కొనియాడారు. గతంలో జగన్ ను గిరిజన ప్రాంతాలన్నీ ఆదరించాయని, వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్సార్ సీపీని గెలిపించి ఈ ప్రాంతాల్లో జగన్ కు ఎవరూ సాటి లేరని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.