తొలిరోజే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోహన్ యాదవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిర్ణీత పరిమితికి మించి లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోహన్ యాదవ్ కేబినెట్ సమావేశం నిర్వహించారు.