మిచౌంగ్ తుపాను ప్రభావంతో రహదారులు ధ్వంసం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, అనంతపురం జల్లాల పరిధిలో 437 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
వీటి శాశ్వత మరమ్మతులకు రూ.170 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఏడు జిల్లాల్లో తాత్కాలిక రిపేర్లతో రాకపోకలను పునరుద్ధరించారు.