పార్లమెంట్ జరిగిన అనూహ్య పరిణామంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రకటన చేయాలని కోరారు. పార్లమెంటులో భద్రత వైఫల్యం అత్యంత తీవ్రమైన అంశమని ఖర్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు.