విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి రెండో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆస్పత్రిలోని రోగులు భయంతో పరుగులు తీశారు.
కొందరు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.