దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నిటిని దారి మళించి నడుపునున్నట్లు వాల్తేర్ సీనియర్ డిసీఎం ఎ.కే త్రిపాఠి తెలిపారు.
ఈ నెల 18 నుంచి 31 వరకు గుంటూరు-విశాఖ సింహాద్రి ,మచిలీపట్టణం -విశాఖ ఎక్స్ ప్రెస్ ,19 నుంచి జనవరి 1 వరకు విశాఖ-గుంటూరు సింహాద్రి,విశాఖ-మచిలీపట్టణం ఎక్స్ ప్రెస్ 18 ,19 ,20 ,22 ,23 ,25 ,26 ,27 ,29 ,30 తేదీల్లో విశాఖ -విజయవాడ -విశాఖ ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.