తన భర్త పింఛను కోసం ఓ మహిళ 60 ఏళ్లుగా పోరాడి, విజయం సాధించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శేషగిరిరావు 1962లో మరణించారు. అతని భార్య కృష్ణవేణి పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా మంజూరు కాలేదు.
ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో 2021లో ఆమె లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. లోకాయుక్త ఆదేశాలతో 60ఏళ్ల పెన్షన్ బకాయిలు రూ15.70 లక్షలను అధికారులు తాజాగా ఆమెకు అందజేశారు.