మసాయిదా ఓటర్ల జాబితా సవరణ పగడ్బందీగా చేపట్టడం జరుగుతుందని, దరఖాస్తులు ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖఆదేశించారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దారులు, బూత్ స్థాయి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఓకే ఇంట్లో పదిమంది ఓటర్ల కంటే అధికంగా ఉంటే పరిశీలించాలని, డబుల్ ఎంట్రీ శాశ్వత వలస ఓటర్లు గుర్తించి నిబంధనలు మేరకు తొలగించాలన్నారు.