అంగన్వాడీల న్యాయమైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఉరవకొండలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం మూడవ రోజు కూడా కొనసాగింది. సీపీఎం నాయకులు రంగారెడ్డి, మధుసూదన్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు 26 వేలు తగ్గకుండా ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటి అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.