ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంగనవాడీల సమస్యలు ప్రభుత్వం తీర్చాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 03:29 PM

 రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెపై ముఖ్యమంత్రి జగన చొరవ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాయదుర్గం కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. అంగనవాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు బుధవారం ఆయన సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. జగన పాదయాత్రలో అంగనవాడీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో వారు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీ మల్లికార్జున, సీపీఎం నాయకులు మధు, ఆంజినేయులు, అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన నాయకులు రాధమ్మ, ఉలిగమ్మ, రుద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com