'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోస్తా జిల్లాల్లో తుపాను నష్టాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నందున ఆడుదాం ఆంధ్రను. ఈ నెల 26కు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
మొదట నిర్ణయించిన ప్రకారం నవంబరులో కార్యక్రమం ప్రారంభమవ్వాలి. పలు కారణాలతో డిసెంబరు 15కి ప్రభుత్వం వాయిదా వేసింది. మిగాజాం వల్ల జరిగిన పంట నష్టాని గుర్తించే పనుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఉండటంతో మరోసారి వాయిదా పడింది.