వచ్చారు.. చూశారు.. వెళ్లారు అన్నట్లు కేంద్ర బృందం పర్యటన సాగింది. మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు జిల్లాలోని కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లో, తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, గూడురు నియోజకవర్గాల్లో కేంద్ర బృందం పర్యటించింది.
తిరుపతి జిల్లాలో రైతులతో ఎక్కడా మాట్లాడకుండానే పర్యటన ముగించింది. కేంద్ర ప్రభుత్వానికి నష్టాన్ని నివేదించి నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చింది.